మూడవ వ్యాసం – తెలుగు భాషా దినోత్సవం, ఇతిహాసాలు, మాధ్యమాలు

భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలకు  ఆయా విధముగా రాష్ట్రాలకు పేరులు పెట్టి పిలవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే తెలుగు రాష్ట్రాలుగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష ఔన్నత్యం అంత గొప్పది. దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో చాలా మంది పిల్లలు అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు కూడా చెప్పే అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. తెలుగులో మాట్లాడితే ఎక్కడ చదువు రాని వారిగా చూస్తారో? అనే ఒక ఆలోచన ఈ తరం వాళ్ళకి బలంగా నాటుకుపోయింది. ఇటువంటి సమయంలో రాబోయే తరాలకు తెలుగు యొక్క గొప్పతనం గురించి ఖచ్చితంగా తెలియచేయాలి అంటే తెలుగు వారిగా తెలుగు భాషా పరిరక్షణకు మనము ఏమి చేయాలి?

తెలుగు భాషా దినోత్సవం [29th August]

తెలుగులోనే చదవాలి..
తెలుగులోనే రాయాలి..
లెలుగులోనే మాట్లాడాలి..
తెలుగులోనే సంభోదించాలి..
తెలుగు జాతి గర్వించగలిగేలా భాష చరిత్ర గురించి, గొప్పతనం గురించి చాటి చెప్పాలి.

ఇటువంటి బలమైన నినాదాలతో తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ప్రజలు పాటుపడాలి. అన్నిటితో పాటు దీనికీ ఓ దినం అనుకుంటే తెలుగు ఉనికిని కోల్పోతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి తెలిసేలా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించాలి. అందులో పిల్లలని, పెద్దలను పాల్గొనేలా చేయాలి. భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించాలి.

ఇతిహాసాలు, సాహిత్యం, పాఠాలు

ఒక మనిషి ఎలా బ్రతకాలి? ఎలాంటి అలవాట్లు ఉంటే ఉత్తముడుగా సమాజం గుర్తిస్తుంది అని చెప్పేవి మన పురాణ, ఇతిహాసాలు. అటువంటి జ్ఞానసముపార్జనామూలాలను తెలుగులో పిల్లలకు చెప్పడం ద్వారా వాటి నుంచి మంచినే కాక భాషను కూడా నేర్చుకుంటారు.
మన తెలుగు బాష గురించి, కవిత్వం గురించి ఎంతో వైశిష్ట్యంతో మాట్లాడిన రాజులూ, ఇతర భాషలకు చెందిన కవులు గురించి పిల్లలకి చెప్పడం వల్ల వారికి తెలుగు మీద అభిమానం పెరుగుతుంది. అంతే కాక, ప్రపంచంలోనే ఉత్తమమైన లిపులలో తెలుగు రెండవ స్థానం పొందినదిగా వారికి పరిచయం చేస్తే, స్వభాష పట్ల వారు గర్వంతో ముందుకి వెళ్తారు.

తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం ఎలా చెప్పగలము? సాహిత్య పరంగా తెలుగు పాదములు వాడుకనే ఉదాహరణగా చెప్పొచ్చు. మన అందరికి ఎంతో సుపరిచితమైన ఆవు, పులి కధలో, తనని చంపేస్తానని చెప్పిన పులిని సైతం ఆవు – “వ్యాఘ్ర కుల భూషణ” [పులి వంశ శ్రేష్టుడా] అని సంభోదిస్తుంది. ఈ పాదములలో దాగి ఉన్న నీతిని పిల్లలకు తెలుపుటకు ఎన్ని రోజులైనా సరిపోదు. ఇటువంటి నీటి వాక్యాలు, కథలు మన సాహిత్యంలో లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి ద్వారా తర్వాతి తరాల వారికి తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయవచ్చు, దాని గొప్పతనాన్ని చాటవచ్చు.

తెలుగు భాషా

గుఱ్ఱం జాషువా, కందుకూరి వీరేశలింగం పంతులు, గిడుగు రామ్మూర్తి, శ్రీ శ్రీ, మొదలగువారి రచనలను పరిచయం చేస్తే ఏ తెలుగు సంతతి వ్యక్తి కూడా తెలుగును తక్కువ చేసి చూడలేడు. 

తెలుగుని నామమాత్రంగా పాఠశాలల్లో బోధించే పద్దతిని విడనాడాలి. ఒకటవ తరగతి పుస్తకం నుంచి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల వరకు తెలుగుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

Telugu App

 మనలో చాలా మందికి తెలుగుని వాడాలని ఉన్నా తెలుగు ఎలా టైపు చెయ్యాలో తెలియక ఆంగ్లాన్ని వాడుతారు. ఈ సమస్యను చిన్న యాప్ ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. ఇటువంటి యాప్ ఒకటి సృష్టించి, దీని గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేయాలి.  సంచలన వార్త త్వరగా అందరికి చేరుతుంది (వైరల్ అవుతుంది). ఇలాంటి వార్తలను అందరు ఆసక్తితో చదువుతారు. ఇటువంటి వార్తలలో ఉపయోగపడేవి ఈ యాప్ ద్వారా తెలుగులో అందించగలిగితే, తెలుగులోనే అందరికి సమాచారం అందుతుంది. అలా చేస్తే తెలుగు వినియోగం పెరిగి పర భాషా వినియోగం తగ్గుతుంది.

తల్లి పాలు వలె అమృతతుల్యమైన భాష తెలుగు, అటువంటి భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. పైన పేర్కొనబడిన అంశాలను పాటించగలిగితే తెలుగు భాష ఉనికిని కాపాడుకోవడమే కాక ప్రపంచంలో తెలుగు భాష యొక్క కీర్తిని పెంచవచ్చు.

వ్యాసం రచించిన వారు:
1. Lokaraju Panthadi
కృష్ణా జిల్లా
Twitter – @lokarajuking
2. Durgaprasad Pulicharla
పశ్చిమ గోదావరి
Twitter – @dimple_dsp
3. Nagaraju Vuppala
సికింద్రాబాద్
Twitter – @nagarajua5

Comments

comments