దోమతో ముఖాముఖి
మశకము, చీకటీగ అని కూడా పిలవబడే దోమలో మూడువేల ఐదు వందల [౩౫౦౦] జాతులు ఉన్నాయి. అన్ని జాతులలో కేవలం వందకి పైబడిన జాతులు మాత్రమే మనిషి శరీరం మీద వాలి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తాయి. చీకటీగ పది కోట్ల సంవత్సరాల క్రిందటే ఉనికిలో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జికా, చికున్ గున్యా, డెంగ్యూ , మలేరియా, ఇలా ఎన్నో ప్రాణాంతక రోగాలను వ్యాప్తి చేయగల మశకము భూమికి భారమా? వాటిని సూటిగా ఘాటైన ప్రశ్నలను…