చందమామ వ్యవసాయం – చంద్రుడు యొక్క స్నేహభావం
ప్రాచీన భరత ఖండమున, అన్ని రాజ్యములకు కేంద్రముగా “కరాళము” అను రాజ్యము. ఆ రాజ్యమును, ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పాలించి, కీర్తి గడించిన రాజు నిర్వికల్పుడు. ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పటి నుండి కరాళమే కాక, ఇతర రాజ్యములతో కూడా సాన్నిహిత్యము పెంచుకుని, భరత ఖండమును ఐక్యము చేయ ప్రయత్నం చేశారు. మహాజ్ఞాని అయిన, నిర్వికల్పుని రాజ్యాన్ని ముక్కోటి దేవుళ్ళు ఎల్లప్పుడూ వీక్షిస్తూ, ఎటువంటి కష్టం రానివ్వకుండా తమ దీవెనలతో కాపాడేవారు. అటువంటి రాజ్యంలో అనుకోని సమయం, అనుకోని…
నేటి భారతం మరియు నవ భారతం
నేటి భారతం ఏమిటి ఈ నేటి భారతం ఎటు వెళుతుందో ఏమిటో|| స్వాతంత్రం వచ్చిన తరువాతే స్వాగతించారు అజ్ఞానాన్ని స్వాతంత్రం వచ్చిన తరువాతే తెర తీశారు కుల మతాలకు|| ||ఏమిటి|| గడప దాటిన ప్రతి వనితకు లేనే లేదు స్వేచ్ఛ స్వాతంత్రం అర్ధరాత్రి కాదుగదా పగలే భయం ప్రతి క్షణం|| ||ఏమిటి|| రైతే రాజని అంటారు రైతు కడుపుని కొడతారు మధ్య తరగతి బతుకులకు త్రిశంకు స్వర్గం చూపిస్తుంది నేటి భారతం|| ||ఏమిటి|| ఎటు చూసినా ఆకలి…
రెక్కలు – లేనూరు అనే గ్రామంలో
తరాలు మారినా పల్లెటూరు లోని ప్రేమలు ఆప్యాయతలు మారవు అంటారు. ఆ అనురాగాలను వెతుకుతూ అతడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో సంవత్సరాలు తర్వాత వెల్దామనుకున్నాడు. రెక్కలు కోసేసిన విహంగంలా పట్నం లో నాలుగు గోడల మధ్య, నవ్వు లేని నవ్వుల మధ్య, ప్రేమ లేని పలకరింపులు మధ్య, ఆశ గమ్యమైన మాటల మధ్య నలిగిపోయిన అతనికి ఒక రోజు చిన్నప్పిటి అమ్మమ్మ కథలు, తాతయ్య పెద్దరికం, పాలేరులతో ఆట, స్నేహితులతో వాగులు గుట్టలు తిరగడం…
సమాధి, మూడు పక్షులు, అండము
ప్రవాహం లాంటి జీవితాన్ని వదిలి అతను సమాధి లో పడుకున్నాడు. ఎంత కాలం గడిచినా అరిషడ్వర్గాలు వీడక అతడి ఆత్మ అతడితో పాటే సమాధిలో గడుపుతుంది. స్వభావం చచ్చిపోలేదు, శరీరం కుళ్లిపోలేదు, ప్రాణం విడిచిపోలేదు. అంధకారంలో గడిపినవి క్షణాలో, యుగాలో తెలియని అతను భరించలేక తనకి తోడు ఉన్న వాటిని అన్నిటిని తనలో కలిపేసుకుని భూమిని నెమ్మదిగా తొలుచుకుంటూ బయటకి వచ్చాడు. నయానందకరమైన ఎన్నో దృశ్యాలను ఆశించిన అతడికి చుట్టూ ఎడారి కనిపించింది. నాగరికత, మనిషి జాడ…
సాహిత్యలోకం కవితల పోటీ – June 2019
మే ౨౦౧౯ [May 2019] – జూన్ ౨౦౧౯ [June 2019] వ్యవధిలో సాహిత్యలోకం ప్రకటించిన కవితల పోటీ లో పాల్గొన్న వారిలో మా ద్వారా ఎంపికైన విజేతలకు మా శుభాకాంక్షలు. సాహిత్యం మనిషికి ఊపిరి కావాలని, సాహిత్యమే మనిషిని ఉన్నతుడ్ని చేయగలదని నమ్ముతూ, మన తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, వాణిజ్య పోకడలను అద్దుకుంటున్న మన తెలుగుకి పునర్వైభవం తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం. ______________________________________________________________________________ కవితల పోటీ లో మొదటి స్థానం పొందిన వారు…