నా రాధ – శ్రీ కృష్ణుని హృదయ తపము
మదియందు కల్లోలము , ఉష్ణోగ్రమున్ వేగలేక వివర్ణమౌ పింఛము… మ్రోగుటకు వేణువు ఊపిరేది అనగా, మురారిన్ జూచి వాయువు పాడలేననగా… వనమాలిని గాంచి పుష్పించుట మరిచె వనముల్, మధుభాషనుండి మౌనమున్ గ్రహింపలేక ఊగాడె పద్మముల్… ఉద్యానవనంబున పెరిగెనొక విచారంబు శ్రీ కృష్ణుని యదలోన నీట కన్నీరు చేరి, తడబాటుతో కదిలె జీవము కొలనులోన… “కుసుమ ప్రియా నయన, కమలాకర హృదయ చోర, రసరంజకమౌ నీ గానమున్ వినుటకు తపియించె మనసారా, సంకల్ప-వికల్పముల్ నొదిలి నీ ఆరాధ భూషణముల్…