రెక్కలు – లేనూరు అనే గ్రామంలో
తరాలు మారినా పల్లెటూరు లోని ప్రేమలు ఆప్యాయతలు మారవు అంటారు. ఆ అనురాగాలను వెతుకుతూ అతడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో సంవత్సరాలు తర్వాత వెల్దామనుకున్నాడు. రెక్కలు కోసేసిన విహంగంలా పట్నం లో నాలుగు గోడల మధ్య, నవ్వు లేని నవ్వుల మధ్య, ప్రేమ లేని పలకరింపులు మధ్య, ఆశ గమ్యమైన మాటల మధ్య నలిగిపోయిన అతనికి ఒక రోజు చిన్నప్పిటి అమ్మమ్మ కథలు, తాతయ్య పెద్దరికం, పాలేరులతో ఆట, స్నేహితులతో వాగులు గుట్టలు తిరగడం…