ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ
గ్రీకు పురాణగాథలలో ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కథను ఎన్నో విధాలుగా ప్రపంచమంతా ప్రచురణలో ఉండగా, ఒవిడ్ వ్రాసిన “మెటామోర్ఫోసిస్” అనే మహాకావ్యంలోని కథ అత్యంత ప్రాధాన్యత పొందినది. ఈ మెటామోర్ఫోసిస్ మహాకావ్యంలో పదవ మరియు పదకుండవ పుస్తకంలో ఓర్ఫియస్ గురించి సవివరంగా వ్రాస్తాడు ఒవిడ్. ఓర్ఫియస్, ప్రసిద్ధ కవి మరియు సంగీతకారుడు. అతడు సంగీతంతో దేనినైనా మంత్రముగ్దుని చేయగల సామర్థ్యం గలవాడు. ఒక సారి లైర్ [వీణ…