నైజీరియా దేశపు యోరుబా థియేటర్
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా నాటకాలు మరియు మతాచారాలు విడదీయలేనివిగా ఉంటాయి. గ్రీకు, సంస్కృతం మరియు ఇంగ్లీషు నాటకాలు అన్నీ కూడా మతం, పండుగలు మరియు ఆచారాల నుండి స్ఫూర్తిపొందినవిగా లేదా ఉద్భవించినవిగా ఉన్నాయి. నైజీరియాలోని యోరుబా ప్రదర్శనల గురించి కూడా ఇదే విధంగా చెప్పొచ్చు; యోరుబా థియేటర్ (Yoruba theatre)లో అక్కడి దేశపు ప్రజలు యొక్క సంప్రదాయాలను నాటకరంగం మీద ప్రతిబింబిస్తారు. యోరుబా థియేటర్ అనేది రంగురంగుల దుస్తులు, సంగీతం, డ్రమ్మింగ్ మరియు మైమ్ల కలయికగా ఉంటుంది.…