Coco [2017] – సంగీతం, ఆత్మల లోకం, ఓ కుక్క…

సంగీతం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాయి,

పాదరక్షలు ఆ కుటుంబాన్ని కాపాడాయి…

Coco movie review in telugu

ముఖ్య కథ

సంగీతాన్ని, పాదరక్షలని పోల్చడంతో ఆ కుటుంబానికి సంగీతం అంటే ఎంత అసహ్యమో తెలియజేస్తాడు Lee Unkrich [Director].  ఆ అసహ్యం వెనుక ఉన్న కథను, ఆ కుటుంబానికి చెందిన పిల్లవాడు ఓ కథ రూపంలో చెప్తాడు.

Imelda అనే ఆమె సంగీతకారుడ్ని పెళ్లి చేసుకుని Coco అనే అమ్మాయికి జన్మనిస్తుంది. కూతురు పెరుగుతున్నా అతడు సంగీతం మీద ఇష్టంతో ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి ఆమె తన కుటుంబంలో ఎవరికీ సంగీతం మీద ఆసక్తి కలుగకూడదు అని, కుటుంబంలో సంగీతాన్ని నిషేధిస్తుంది. ఆ ఆచారాన్ని అన్ని తరాలు వారు పాటిస్తారు.

కొన్ని తరాల పాటు పాదరక్షలు చేసుకుంటూనే ఆ వంశం వారు బతుకుతారు. ఆ కుటుంబంలో కి ముని మనవడు Miguel. సంగీతం అంటే ప్రాణం, ఎవరికీ తెలియకుండా guitar వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. Ernesto de la Cruz అనే సంగీతకారుడు అంటే ప్రాణంకంటే ఎక్కువ ఇష్టం. Miguel యొక్క అమ్మమ్మ Abuelitaకి సంగీతం అంటే మహా కోపం, దారిలో ఎవరు పాడినా వెళ్లి తిట్టేస్తుంది; అలాంటి కుటుంబంలో Miguel ఎలా తన ఇష్టాన్ని కాపాడుకున్నాడు అనేది కథ…

ఉప కథలు

Dia de los Muertos [The Day of the Dead]

Mexico లో సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం కుటుంబంలో చనిపోయిన పూర్వీకుల కోసం ఒక రోజు కేటాయించి, వారి జ్ఞాపకార్థం photos పెట్టి, నచ్చినవి వండి పెట్టి, స్మశానం నుండి ఇంటి వరకు పూలతో మార్గం చేసి, చనిపోయిన వారు తిరిగి వచ్చారు అని సంబరాలు చేసుకుంటారు. అయితే ఆ రోజు పూర్వీకులకు ఏమైనా పెట్టాలె కానీ, వారి వస్తువులు తీసుకోకూడదు. తన ప్రతిభను చూపడానికి Ernesto de la Cruz guitarని ఆయన సమాధి వద్ద నుండి తీసుకుని వాయించగానే, ఆత్మల లోకానికి వెళ్ళిపోతాడు [చనిపోకుండా].

Coco movie in Telugu
Dante, Miguel & Hector

Hector Rivera

Imeldaని కలుసుకుని తిరిగి తన ప్రపంచానికి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలి అనుకుంటాడు Miguel. ఆమె సహాయం చేస్తుంది అంటుంది కానీ, సంగీతాన్ని వదిలేయమంటుంది. Imelda భర్త అని తెలుసుకున్న Ernesto de la Cruz, ఆయన దగ్గరకి సహాయం కోసం వెళ్తాడు. మధ్యలో Hector పరిచయం అవుతాడు. ఆత్మ లోకంలో ఆత్మలు ఉండాలి అంటే, వాటిని నిజమైన ప్రపంచంలో వారి కుటుంబం వారు లేదా సన్నిహితులు గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుని Dia de los Muertos  నాడు వారిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి, లేదంటే ఆత్మ సూన్యంలో కలిసిపోతుంది. Hectorని తన కుటుంబం వారు మర్చిపోయే స్థితిలో ఉంటారు, అప్పుడు Miguel తిరిగి ప్రపంచంలోకి వెళ్ళినపుడు తన కుటుంబానికి తన ఫోటో ఇస్తే Ernesto de la Cruzదగ్గరకి తీసుకువెళతాను అని ఒప్పందం చేసుకుంటాడు.

Ernesto de la Cruz

Ernesto de la Cruz ఆత్మ లోకంలో అత్యంత ప్రముఖమైన సంగీతకారుడు. ప్రతి సంవత్సరం Dia de los Muertos  నాడు అతని పాటతోనే పండుగ ముగుస్తుంది ఆత్మలకు. పాటలు, సంగీతం, చిత్రాలు, ఇలా ఎన్నెన్నో కలలో పాండిత్యంగలవాడై అందరి అభిమానం పొందుతాడు. తనకి ఒక ముని-ముని మనవడు ఉన్నాడు అని తెలియగానే ఎంతో సంతోషించి Miguelని అక్కున చేర్చుకుంటాడు.అదే సమయంలో Hectorకి Ernesto de la Cruzకి మధ్య జరిగే సంభాషణలు చిత్రాన్ని మలుపు తిప్పుతాయి.

Dante [కుక్క, ఆత్మల మార్గదర్శి]

*Dante చాలా ప్రసిద్ధమైన ఇటాలియన్ కవి, ఆయన వ్రాసిన మహాకావ్యం “Divine Comedy“లో ఆయనకు నరకం నుండి స్వర్గం వెళ్లే దారిలో ప్రముఖమైన వ్యక్తులు మార్గనిర్దేశం చేస్తారు. ఆ ఆలోచనను Coco చిత్రంలో చక్కగా ఇమిడేలా చేసారు.

Dante ఒక వీధి కుక్క, చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తుంటుంది. Imelda ఆత్మ లోకంలోనుండి నిజ ప్రపంచంలోకి రాలేకపోవడం Dante చేసిన తుంటరి పని వల్లనే. అయితే ఆ తుంటరి పని యొక్క అవసరం, విశిష్టత చిత్రం ముందుకి వెళ్లేకొద్దీ తెలుస్తుంది. ఆత్మల లోకంలో Miguelని కాపాడిన తర్వాత Dante రూపాంతరం చెంది రెక్కలు రావడం చూపర్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 

ఈ ఉప కథలను ముఖ్య కథలతో కలుపుకుంటూ, పెదవులపై చిరున్నవ్వు తెప్పించేలా, కంట్లో నీరు తెప్పించేలా, మెదడులో అలజడి రేపేలా చిత్రాన్ని ఎంతో చక్కగా తీశారు. ఎన్నో సంవత్సరాల ఆలోచనలు, కృషి, కథ పై పెట్టిన ఏకాగ్రత, చిత్రీకరణలో చూపిన శ్రద్ద, ఇవన్నీ Coco చిత్రం చూసేటప్పుడు చూపరులకు అర్ధం అవుతాయి.

Cocoలో మర్చిపోలేని సన్నివేశాలు

+ Cheech అనే ఆత్మ తన ముందే సూన్యంలో కలిసిపోతున్నపుడు Hector పడే బాధని అద్భుతంగా చూపించారు.

+ ఆత్మల లోకంలో Miguel, పాట పాడే ముందు, పాడేటప్పుడు, పాడిన తర్వాత చిత్రానికి కీలకమేకాక, కఠినంగా విధానాలను పాటించాలి అనుకునే వారిని సైతం కరిగించగల సన్నివేశాలు.

+ ఒకానొక సందర్భంలో Hector తన భార్యని కలుసుకున్నపుడు, వారి సంగీత ప్రదర్శన ప్రేమకి నిదర్శనంగా ఉంటుంది.

+ Remember Me అనే పాట ఆత్మ లోకంలో Miguel విన్నప్పుడు, అదే పాట Coco దగ్గర పాడినప్పుడు కంట నీరు పెట్టని వారు ఉండరు.

చివరిగా:

Coco చిన్న పిల్లవాడి జీవితం మీద తీసిన చిత్రమే అయుండొచ్చు, కానీ చిన్న పిల్లల చిత్రం కాదు. కుటుంబంలో ప్రతి ఒక్కరు చూసి అర్ధం చేసుకుని, పిల్లలు కనే కలలు ప్రోత్సహిస్తే వారు ఎంతగా ఎదుగుతారో తెలియజెప్పే చిత్రం. అంతేకాదు, ఒక కూతురు తండ్రి మీద పెంచుకున్న అపారమైన ప్రేమను ఇందులో చూడొచ్చు, ఒక భర్త తన కుటుంబాన్ని వదిలేసి ఎంత బాధపడ్డాడో తెలుసుకోవొచ్చు, ఒక పిల్లవాడు కుటుంబమే అన్నిటికన్నా గొప్ప వరం అని ఎలా తెలుసుకున్నాడా చూడొచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆశయం దృఢం అయినది అయితే రాయినైనా కరిగొంచొచ్చు అనే మహోన్నతమైన సత్యాన్ని Coco ద్వారా అర్ధం చేసుకోవొచ్చు.

Comments

comments