మూడవ వ్యాసం – తెలుగు భాషా దినోత్సవం, ఇతిహాసాలు, మాధ్యమాలు
భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలకు ఆయా విధముగా రాష్ట్రాలకు పేరులు పెట్టి పిలవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే తెలుగు రాష్ట్రాలుగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష ఔన్నత్యం అంత గొప్పది. దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో చాలా మంది పిల్లలు అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు కూడా చెప్పే అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. తెలుగులో మాట్లాడితే ఎక్కడ చదువు రాని వారిగా చూస్తారో? అనే ఒక ఆలోచన…
రెండవ వ్యాసము – సాంకేతిక అనుసంధానమే “తెలుగు భాష” కు రక్షణ ఛత్రం
1. శాస్త్రం + సాంకేతికత <=> తెలుగు 21 వ శతాబ్దం అద్భుతాలకు నిలయం. సాంకేతికతకు ఆలవాలం. అసాధ్యమే సుసాధ్యంగా చేస్తోంది ప్రయాణం. ఈ ప్రస్థానంలో సాంకేతికత (Technology) ఉరకలేస్తుంది. ఇందులో ఏ భాషైనా కొట్టుకు పోవాల్సిందే. కొన్ని కొట్టుకు పోతున్నాయి. మరికొన్ని దానితో కలిసి పరుగులు పెడుతున్నాయి. మరి మన తెలుగు భాష? ఏం చేయాలనే ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలోంచి బయటకు రావాలి. నేటి సాంకేతిక సమాజంతో సమానంగా పరుగు పెట్టాలి. అలా…
మొదటి వ్యాసం – తెలుగు భాష ఉనికిని కాపాడేందుకు ఏం చేయాలి?
భాష అన్నది కేవలం పదాలు, మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, భాషలో ఒక సంస్కృతి నిక్షిప్తమై ఉంటుంది. ఆ సంస్కృతిని పెంపొందించటానికి తరతరాలుగా ఏంతోమంది కృషి చేసి, ఆయా దేశ కాల మాన పరిస్థితులకి అణుగుణంగా జీవన విధానాన్ని, అలవాట్లను, ఆచారాలను మనకి అందించారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, రోజూ జరిగే సన్నివేశాలను నాటకీయంగా వర్ణించడానికి తెలుగులొ బొలెడన్ని జాతీయాలు సామెతలూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, మన పూర్వ తరాలు యెలాంటి జీవితాన్ని గడిపేవాళ్ళో, వాళ్ళు చూసిన…
దోమతో ముఖాముఖి
మశకము, చీకటీగ అని కూడా పిలవబడే దోమలో మూడువేల ఐదు వందల [౩౫౦౦] జాతులు ఉన్నాయి. అన్ని జాతులలో కేవలం వందకి పైబడిన జాతులు మాత్రమే మనిషి శరీరం మీద వాలి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తాయి. చీకటీగ పది కోట్ల సంవత్సరాల క్రిందటే ఉనికిలో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జికా, చికున్ గున్యా, డెంగ్యూ , మలేరియా, ఇలా ఎన్నో ప్రాణాంతక రోగాలను వ్యాప్తి చేయగల మశకము భూమికి భారమా? వాటిని సూటిగా ఘాటైన ప్రశ్నలను…
దరిద్రపు లమ్డికొడుకు | తుషార [Tushara] నరకయాతన
ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు, ఇద్దరు పిల్లల తల్లి. కోపాగ్ని దహించి వేస్తున్నా, ప్రశాతంగా ఉండగలిగే గుణం ఉండాలని ఏమో, ఆమెకు తుషార అని పేరు పెట్టారు ఆమె తల్లితండ్రులు. తుషారకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు, భర్త పేరు చందు, అత్త పేరు గీత. పేర్లు చూసి ఒకరు చందమామలా చల్లగా, ఇంకొకరు భగవద్గీతలా తత్త్వం నింపుకుని ఉంటారు అనుకుంటే తప్పు. ఇద్దరికీ ఉన్మాదం అంటే ఇష్టం. మానసికంగా, శారీరకంగా మనిషిని వేదించడం అంటే సరదా…