నీతి కథ: కాకి – కోయల
అనగనగా ఒక అడవిలో కోయలలు కలిసి నివసించేవి. అవి పూట అంతా దొరికిన ఆహారాన్ని ఒక దగ్గరకు చేర్చి, స్నేహితులు అందరితో పంచుకుని తినేవి. ఈ తంతుని చాలా రోజుల నుండి గమనిస్తున్న ఒక కాకి, ఏ కష్టమూ లేకుండా ఆహరం సంపాదించేయొచ్చు అని తన తెలివితో పన్నాగం పన్నింది. మగ కోయల నల్లగా, ఎర్రని రెక్కలతో తనకి దగ్గర పోలికలతో ఉంటుంది కాబట్టి కాకి తన రెక్కలకి ఎర్ర రంగు పూసుకుని చడీ-చప్పుడు లేకుండా కోయల…
తూర్పున ఉదయించే చావు
“నా మజిలీలో మరొక్క రోజు, మరొక్క సృష్టి, మరొక్క చావు.” నేను మోసే ఉదయాలు ఇంకా దాహార్తితో కష్టపడట్లేదు, ఉదయపు కిరణాలు గడ్డి మైదానాలను ఆనందంతో నిద్రలేపగలుగుతున్నాయి. మేలుకోండి! మేలుకోండి! ఏ మనిషి చేతి గొడ్డలి మీ మీద పడదు అనే ధైర్యంతో మేలుకోండి, బద్దకాన్ని బెరడుగా చేసుకున్న వృక్షాల్లారా. పరిగెత్తు లేగ దూడ, నీ స్వాతంత్య్రం కొద్దీ సేపే, తల్లి పాల అమృతత్వం కోసం పరిగెత్తు. నిద్రలేవండి! తండ్రులారా – భూదేవిని తొలిచి మీరు పడే…
ఒంటేనుగు | Camel & Elephant
అనగనగా ఒక అరణ్యంలో, ఏనుగుల గుంపు నుండి ఒక ఏనుగు విడిపోతుంది. దారి తెలియక చాలా సేపు తిరిగి, తప్పిపోయి ఆ అరణ్య సమీపాన ఉన్న ఎడారికి చేరుతుంది. ఎడారి అంటే సరిగ్గా తెలియని ఆ ఏనుగు, ముందుకు వెళ్తే నీరు దొరుకుతుందేమో అనే ఆశతో ఎడారిలోకి వెళ్తుంది. పాపం, ఆ ఏనుగు ఎంత తిరిగినా ఒక్క నీటి చుక్క కూడా కనిపించదు. ఇంతలో ఆ ఏనుగుకి దూరంలో ఒంటె కనిపిస్తుంది. సాటి జంతువు కనిపించిందని సంతోషంతో…