నీతి కథ: నక్క – మేక
మనుషులు వదిలేసి, అరణ్యంగా మారిన ఒక విశాలమైన తోటలో, సంవత్సరాల క్రితం తవ్విన బావి ఉంది. పక్షులకి, జలచరాలకి తప్ప అందులో నీరు జంతువులకి అందేది కాదు. ప్రాణ భయం కలిగిన జంతువులు బావిలో నీటి కోసం ఆశ పడకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లి దాహం తీర్చుకునేవి. ఆ అరణ్య సమీపంలో నివసించే ఒక నక్క – “ప్రతి రోజూ తిండి కోసం వెతకాలి, నీటి కోసం కూడా వెతకాలా?” అని ఆలోచిస్తూ, ఆ బావి దగ్గరకి…
ధైర్యంతో ముందడుగు – మనసుకి చెప్పుకోవాల్సిన సమాధానాలు
జీవితాన్నే మార్చేసే ఒక ఆలోచన, సొంతకాళ్ళ పై నిల్చోగలిగే ఒక అవకాశం, భవిష్యత్తుని పొందుపర్చగల ఒక ఒప్పందం, ఇలా ఎన్నో విషయాలు మహిళలకు తారసపడుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని చేసుంటే బాగుణ్ణు అని ఆడవారు భవిష్యత్తులో బాధపడతారు, కొందరు చేయాలా వద్దా అని మదనపడతారు, అయితే చేసి చూస్తే తప్పేముంది ధైర్యంతో ముందడుగు వేద్దాం అనుకునేవాళ్లకు చాలా సమాధానాలు మనసు నుండి, సమాజం నుండి ఎదురు అవుతాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుని ముందుకు వెళ్ళడానికి మహిళలకు ధైర్యం…
పిల్లల పెంపకం, చేపల పెంపకం – పద్ధతి, నివారణ, చర్య
ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పదాలు వినడానికి చాలా బాగుంటాయి, తగు మోతాదులో పంచితే ఆచరణలో అద్భుతంగా ఉంటాయి. కానీ ఇవి మితిమీరితే; తల్లి తండ్రులు నీటి నుండి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటారు. పిల్లలు కూడా అంతే, మొదట్లో ముదిగారం చేస్తే తర్వాత భూమి మధ్యకి వెళ్లి బంగారం తీసుకురమ్మంటారు. పిల్లల పెంపకం: నివారణ మరి ఏమి చేయమంటారు అండి, మరీ గుక్క పెట్టి ఏడ్చేస్తాడు మా వాడు, ఏమైనా అడిగింది చేయకపోతే. ఏడిస్తే కన్నీరు…
96 – ప్రేమే జీవితం |Vijay Sethupathi, Trisha Krishnan
ప్రేమ ఒక కావ్యం ప్రేమ ఒక జ్ఞాపకం ప్రేమ ఒక జీవితం ఇటువంటి మాటలు ఈ రోజుల్లో చెప్తే, పాత చింతకాయ పచ్చడి అని ఆ మాటలని, వాటితో ఆ మాటలు చెప్పిన వ్యక్తిని కూడా బయటకి విసిరేస్తారు. ప్రేమ ఒక అవసరం అని అత్యధిక శాతం మంది భావించే ఈ రోజుల్లో దర్శకుడు ప్రేమ్ కుమార్; పాత పచ్చడి రుచి ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేయడానికి తీసిన ఓ మధురకావ్యం 96. 96 కథ ఆకర్షణ…
నా రాధ – శ్రీ కృష్ణుని హృదయ తపము
మదియందు కల్లోలము , ఉష్ణోగ్రమున్ వేగలేక వివర్ణమౌ పింఛము… మ్రోగుటకు వేణువు ఊపిరేది అనగా, మురారిన్ జూచి వాయువు పాడలేననగా… వనమాలిని గాంచి పుష్పించుట మరిచె వనముల్, మధుభాషనుండి మౌనమున్ గ్రహింపలేక ఊగాడె పద్మముల్… ఉద్యానవనంబున పెరిగెనొక విచారంబు శ్రీ కృష్ణుని యదలోన నీట కన్నీరు చేరి, తడబాటుతో కదిలె జీవము కొలనులోన… “కుసుమ ప్రియా నయన, కమలాకర హృదయ చోర, రసరంజకమౌ నీ గానమున్ వినుటకు తపియించె మనసారా, సంకల్ప-వికల్పముల్ నొదిలి నీ ఆరాధ భూషణముల్…