పంచభూతములు – ఆలోచనలు , ఆక్రందనలు
౧ బ్రతుకు చెరను విడవజూచి ప్రేతమొక్కటినైతి, గగన మార్గమున తీసుకెళ్ల భటులిద్దరు రాకపోతిరి, కర్మ నిండక, కుండ కాలక భూతములతో కలిగె మైతిరి, పంచభూత భాష్యమెల్ల తెలిసి ఇచట తెల్పగోరితి. ౨ సహనంబు వీడి రోదించే భూమి : “భవభందముల్ వలచి సృష్టినే మరిచేను మనిషి, మోయునట్టి ధరిత్రిని దరిద్రమని అజ్ఞానంబుతొ తలిచె, చేరు గమ్యాన్ని పతనంజేసె, తొలిచి తొలిచి హృదయంబున పొడిచె, కప్పుటకు మన్ను లేక, మట్టి భిక్షమెత్తుకోవలె కపట మహర్షి.” 3 పద్మంబున ఆసీనమై…
దరిద్రపు లమ్డికొడుకు | తుషార [Tushara] నరకయాతన
ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు, ఇద్దరు పిల్లల తల్లి. కోపాగ్ని దహించి వేస్తున్నా, ప్రశాతంగా ఉండగలిగే గుణం ఉండాలని ఏమో, ఆమెకు తుషార అని పేరు పెట్టారు ఆమె తల్లితండ్రులు. తుషారకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు, భర్త పేరు చందు, అత్త పేరు గీత. పేర్లు చూసి ఒకరు చందమామలా చల్లగా, ఇంకొకరు భగవద్గీతలా తత్త్వం నింపుకుని ఉంటారు అనుకుంటే తప్పు. ఇద్దరికీ ఉన్మాదం అంటే ఇష్టం. మానసికంగా, శారీరకంగా మనిషిని వేదించడం అంటే సరదా…